Wednesday, January 22, 2025

ఇరానీ ఛాయ్ లాంటి సినిమా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో కార్తికేయ విడుదల చేశారు. దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ “భాగ్ సాలే అనేది క్రేజీ సౌండింగ్. ఆ పేరులోనే ఫన్ క్రియేట్ అవుతుంది.

ఇది పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ మూవీ. సినిమా షూటింగ్ కూడా సికింద్రాబాద్, వారాసిగూడ, ఓల్డ్ సిటీలో జరిపాం. మంచి ఇరానీ ఛాయ్ లాంటి సినిమా మాది”అని చెప్పారు. హీరో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ “ఈ చిత్రంలో నా పాత్ర పేరు అర్జున్. అతనో టక్కరి దొంగ. తను చేయాలనుకున్నవి చేసేసినట్లు కటింగ్ ఇస్తుంటాడు. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, నందినీ రాయ్, అర్జున్ దాస్యన్, కాలభైరవ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News