Friday, January 3, 2025

సీతారాముల కల్యాణం చూతము రారండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాచలంలో జగదభి రాముడి కళ్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుపుకుంటారు. దే శ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావ డం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం శ్రీరామ దివ్యక్షేత్రం ముస్తాబైంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో రామాలయ ప్రాం గణాన్ని తీర్చిదిద్దారు. కళ్యాణం జరిగే మిథిల స్టేడియాన్ని సుందరంగా అలంకరించారు. యుద్ధప్రాతిపదికన అధికార యం త్రాంగం ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో పాటు వడగాలులు కూడా వీస్తుండడంతో అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. వివిఐపిల కోసం ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక అల గత వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి అధికారులకు దశ దిశానిర్ధేశం చేశారు. మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు.

మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఐటిసి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఆమెతో పాటు ప్రత్యేక అధికారి సురేంద్ర మో హన్, దేవాదయ శాఖ కమిషనర్ హనుమంతరావు కూడా ముందుగానే భద్రాచలం చేరుకున్నారు. నవమి వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవస పరిస్థితులు ఎదురైతే వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, ప్రత్యేక అంబులెన్స్‌లో కేటాయించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల బెడ్ల సంఖ్య పెంచాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. భక్తులు అస్వస్థతకు గురైతే సమీపంలోని అత్యవసర చికిత్స కేంద్రానికి తరలించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నవమి వేడుకలకు ఒకరోజు ముందు జరిగే ఎదుర్కోలు ఉత్సవాన్ని పండితులు, పూజారులు ఘనంగా నిర్వహించారు.

తలంబ్రాలు సమర్పించనున్న సిఎస్
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్ర భుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంక్షలు పాటిస్తూ సీతారాముల చంద్రస్వామి వారి కల్యాణం, మ హా పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యక్షప్రసారాలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నా య చర్యల ద్వారా భక్తకోటికి ఇ బ్బందులు లేకుండా చూస్తామ ని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. భద్రాచలంలో జరిగే సీతారాము ల కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి 15 వేల మంది భక్తులు పాదయాత్రగా భద్రాచ లం చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని చుట్టుపక్కల గ్రా మాలకు చెందిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించడానికి పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 22 సంవత్సరాల నుంచి భక్తులు సీతారాముల కల్యాణ మహోత్సవానికి పాదయాత్ర చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి సుమారు 200 కిలోమీటర్ల మేర భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి కదిలి రావడం విశేషం.

భక్తుల కోసం భద్రాద్రి కల్యాణం ఈ టిక్కెట్లు
హైదరాబాద్: కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ టికెట్‌లను ఆన్‌లైన్ ఉంచామని అధి కారులు ప్రకటించారు. 17వ తేదీన జరిగే భద్రాచలం ఉ భయదాతల టిక్కెట్టుకు రూ.7,500 లతో జంట కల్యాణా నికి ప్రవేశంతో పాటు గోత్ర నామాలు చదువుతారని అధికారులు తెలిపారు. ఈ టికె ట్ కొనుగోలు చేసిన వారికి వస్త్రాలు, తలంబ్రాలు ఇస్తామన్నారు. ఇవే కాకుండారూ. 2,000, రూ.1,000, రూ.300ల టిక్కెట్లు సైతం అందు బాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇంటి వద్దకే తలంబ్రాలు పంపిస్తాం
భక్తులకు శుభవార్త చెప్పిన ఆర్టీసి
హైదరాబాద్: తలంబ్రాలను ఇంటి వద్దకే అందిస్తామని భక్తులకు ఆర్టీసి శుభవార్త చెప్పింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని ఆర్టీసి చేపట్టింది. ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆర్టీసి ఎండి సజ్జనార్ మంగళవారం ట్వీట్ చేశారు. భద్రాచలంలో నేడు జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసి కల్పించిం దని ఆయన తెలిపారు. ఇందుకోసం సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలని సజ్జనార్ భక్తులతో తెలిపారు. ఆన్‌లైన్ తలంబ్రాలను ఎలా బుక్ చేసుకోవాలో వివరిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. అలాగే ఆఫ్‌లైన్‌లోనూ తలంబ్రాలను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం భక్తులు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ ఫోన్ నంబర్‌లైన 040- 23450033, 040 -69440069 ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News