- Advertisement -
ఖమ్మం : ప్రముఖ కవి శ్రీశ్రీ సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకవచ్చారని వికాస వేదిక సాహితీ సంస్త గౌరవాధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత బుక్కా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్‌లు అన్నారు. గురువారం శ్రీశ్రీ వర్దంతిని పురస్కరించుకుని నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌లో గల శ్రీశ్రీ విగ్రహానికి వారు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆకాశంలో విహరిస్తూ చందస్సు, వ్యాకరణం లేకుండా సామాన్య ప్రజలు, శ్రామికులు, కార్మికుల సంక్షేమం కోసం పరితపించిన కవి శ్రీశ్రీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు మలిశెట్టి కృష్ణమూర్తి, రెంటాల చిన్న హుస్సేన్, రేళ్ల శ్రీను, గుమ్మడి పుల్లయ్య, యువకవి గుడిసె రాజశేఖర్, తిరునగరి శ్రీనివాసరావు, సంధ్య, మందుల వీరభద్రం, గరిడేపల్లి శోభనాద్రి, బేతంపూడదది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -