Friday, January 24, 2025

మంచి కమర్షియల్ సినిమాగా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’: నిర్మాత చింతపల్లి రామారావు

- Advertisement -
- Advertisement -

‘గుర్తుందా శీతాకాలం’, ‘రంగ మార్తాండ’ చిత్రాల నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి చింతపల్లి రామారావు. వరుస సినిమాలు నిర్మిస్తూ తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళ్తున్నారు ఆయన. సంక్రాంతి నేపథ్యంలో అశేష  ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మీడియా తో ముచ్చటించారు.

“శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సోలో హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్ కాంబినేషన్లో “శ్రీశ్రీశ్రీ రాజావారు”నిర్మిస్తున్నాను. మాది మంచి కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నెలలో తొలి కాపీ సిద్ధమవుతుంది. అలాగే ఇదే ఏడాది కన్నడలో ఓ ప్రముఖ స్టార్ తో భారీ సినిమా చేస్తున్నాం. మరాఠీలో మరో సినిమా   నిర్మించబోతున్నాం. తెలుగులో ఓ స్టార్ హీరోతో ఈ ఏడాది చివరలో ఓ భారీ సినిమా నిర్మిస్తాం. నేను ఎంత భారీ సినిమాలు చేసినా, కమర్షియల్ వాల్యూస్ తోపాటు, సమాజానికి మేలు చేసే అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఏడాదికి మూడు సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాం” అని చింతపల్లి రామారావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News