Thursday, September 19, 2024

21,22 తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ జాతర

- Advertisement -
- Advertisement -

ఆషాఢ మాసం బోనాలు సందర్భంగా ఈ నెల 21, 22 తేదీలలో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళీ జాతరను వైభవంగా నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామ య్యర్ కోరారు. గురువారం దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో జోగినీలతో ప్రత్యేకంగా సమావేశమైనారు. జోగినిలతో ప్రభుత్వo మొదటి సారి ఇటువంటి సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం చేపట్టే చర్యలకు పూర్తిగా సహకరిస్తామని జోగినీలు ముక్త కంఠంతో అంగీకరించారు. శాంతిభద్రతలు కాపాడుట చాలా ముఖ్యమని గమనించాలని జోగినిలకు అధికారులు సూచించారు. జోగినిలు, శివశక్తులతో పాటు గరిష్టంగా 5 గురిని అనుమతించనున్నట్లు వెల్లడించారు. అడిషనల్ సి.పి. విక్రంసింగ్ మాన్, నార్త్ జోన్ డిసిపి రష్మి పెరుమాళ్,

రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ యం. హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుధీప్ దురిశెట్టి ఈ సమావేశంలో పాల్గొని, మహంకాళీ జాతరను ప్రశాం తంగా నిర్వహించుటకు , అమ్మవారిని దర్శించుకునేం దుకు, బోనాలు సమర్పణకు బోనం తీసుకు వచ్చే జోగినీలు, శివశక్తులకు మధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు బాటా చౌరస్తా నుండి రావాలని కోరారు. దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బోనాలు జాతరలో జోగినిలు పాత్రను ప్రశంసించారు. ఫలహారం బండ్లను రాత్రి 12 గంటలకు క్లోజ్ చేయాలని చెప్పారు. మహంకాళీ జాతరను వైభవంగా నిర్వహించుటకు పటిష్టమైన బారికేడ్లు, తాగునీటి వసతి, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సమావేశంలో జ్యోగినిలు శ్యామల, వైష్ణవి, రాధిక , వెన్నెల, విశాఖ, శ్రుతి , క్రాంతి తదితరులు మాట్లాడారు. తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపి, ప్రభుత్వ మునకు సహకరిo చుటకు అందరూ అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News