Sunday, December 22, 2024

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్‌లో కొండపై వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ అష్ట దశ వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి మంగళ స్నానాలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని పండితుల వేద మంత్చోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత తదితరులు హాజరై స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణోత్సవం అనతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News