Monday, January 20, 2025

దళితవాడల్లో శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించింది నేనే: భూమన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దళితవాడల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం చేయించింది తానేనని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను క్రిస్టియన్ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానం అని అన్నారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదని, పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని, ఇలాంటి వాటికి భయపడనని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 17 సంవత్సరాల క్రితమే తాను టిటిడి చైర్మన్ అయిన వ్యక్తిని అని, 32 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని, తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది తానేనని చెప్పారు.

Also Read: చంద్రుడిపై రాకేష్ రోషన్: మమత తికమక(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News