Monday, December 30, 2024

హీరోయిన్‌గా అరంగ్రేటం

- Advertisement -
- Advertisement -

Sridevi daughter entry for Heroine

శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకొంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌గా మారుతోంది. ఆమె తన మొదటి చిత్రానికి సైన్ చేసింది. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని బోనీ కపూర్ తెలిపారు. ఇక జాన్వీ కపూర్ కూడా త్వరలోనే తెలుగులో నటిస్తుందని ఇటీవలే చెప్పారు. అయితే శ్రేదేవి కూతుళ్లిద్దరికీ బాలీవుడ్ పైనే ప్రధాన దృష్టి. ఖుషీ కపూర్ మొదటి చిత్రం నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తోంది. ప్రముఖ దర్శకురాలు జోయా అఖ్తర్ నెట్ ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకొని కొన్ని సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా పరిచయం కానున్నాడు. షారుక్ ఖాన్ కూతురు సుహానా మరో హీరోయిన్‌గా నటించనుంది. ఇలా ఒకే సినిమాతో ముగ్గురు వారసులు పరిచయం కానున్నారు. ఖుషీ కపూర్ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేసింది. ఆమెకిప్పుడు 21 ఏళ్ళు. అక్క జాన్వీతో పోల్చితే ఖుషి ముఖంలో శ్రీదేవి పోలికలు ఎక్కువ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News