Monday, December 30, 2024

అందమైన అనుభూతినిచ్చే చిత్రం

- Advertisement -
- Advertisement -

సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరోహీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యాన్‌పై ఈ చిత్రానన్ని సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ “శ్రీదేవి శోభన్‌బాబు’.. నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం.

సోమవారం ఓ పాటను రిలీజ్ చేస్తున్నాం. కమ్రాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు” అని అన్నారు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘1970 నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఈ సినిమా సరదాగా ఉంటుంది. ప్రేక్షకులను అందమైన అనుఉభూతిని ఇస్తుంది’ అని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ ‘ ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న పనుల్లో అందరూ బిజీగా ఉంటున్నారు. అందరూ కలుసుకోలేకపోతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన అందరిలోనూ వస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల, గౌరి జి.కిషన్, మహబూబ్ బాషా, మొయిన్, డాలీ, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News