Monday, December 23, 2024

సరదాగా గోల గోలగా ఉండే సినిమా..

- Advertisement -
- Advertisement -

సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్, సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్, ప్రశాంత్ దిమ్మల, భాషా, మొయిన్, విజయ్ మాస్టర్, డాలీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “ఈ సినిమా సరదాగా గోల గోలగా ఉంటుంది. అచ్చమైన తెలుగు సినిమా ఇది. ఫిబ్రవరి 18న వస్తున్న ఈ సినిమాను అందరూ ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడు”అని అన్నారు. విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీదేవి శోభన్‌బాబు సినిమా ఫన్నీగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పారు.

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ అమ్మనాన్నలతో గడిపే క్షణాలు, స్నేహితులతో సరదాగా ఉండే సమయం, ప్రేమలో ఉన్నప్పుడే కలిగే అందమైన అనుభూతులు అన్నీ ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ “ఫ్యామిలీ అంతా కలిసే చూసే చిత్రమిది. హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ అద్భుతంగా నటించారు. సినిమా ఎమోషన్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News