Sunday, December 22, 2024

‘శ్రీదేవి శోభ‌న్ బాబు’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్ బాబు’. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితా కొనిదెల నిర్మించారు. నిన్న సాయంత్ర జరిగిన ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. రొమాన్స్, కామోడీ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ప్రశాంత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని

న‌మ‌స్కారం మ‌రి కొన్ని విశేషాల‌తో మీ ముందుకు వ‌చ్చాం.. క‌థ‌లో ముఖ్యాంశాలు అంటే ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. హీరోకి నోటి వాటం ఎక్కువ అంటూ సంతోష్ శోభ‌న్ క్యారెక్ట‌ర్‌, హీరోయిన్‌కు చేతి వాటం ఎక్కువ అంటూ హీరోయిన్ క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ్యూస్ అవుతుంది. వీళ్ళిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ ఛాలేంజ్‌..గెలిచే స‌మ‌యానికి ఒక స‌మ‌స్య‌. ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న క‌థ‌లో, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాలు. మ‌రెన్నో విశేషాల‌తో త్వ‌ర‌లోనే మీ అభిమాన థియేట‌ర్ల‌లో అంటూ అంటూ వ‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌ధ్య‌లో హీరో చెప్పే ఇక్క‌డ మాట‌ల‌తో నెగ్గం బాబాయి.. మూట‌లుంటేనే నెగ్గుతాం అనే డైలాగ్ ఆలోచింప‌జేస్తుంది. ట్రైల‌ర్‌లో క‌మ్ర‌న్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సిద్ధార్థ్ రామస్వామి కెమెరా ప‌నిత‌నం బాగుంది. వ‌ర్ష‌బొల్ల‌మ్మా హీరోయిన్‌గా న‌టించింది.

Sridevi Shoban Babu Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News