Monday, January 20, 2025

కొత్తగా రెక్కలొచ్చెనా…

- Advertisement -
- Advertisement -

Sridhar act in vargin story

 

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న విక్రమ్ తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు అతను వర్జిన్ స్టోరి చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొత్తగా రెక్కలొచ్చెనా.. అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 3వ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది… అనే పాయింట్‌తో ప్రారంభం నుంచి చివరి వరకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News