Sunday, January 19, 2025

బిఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బిఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కలెక్టర్ పై దాడిని బిఆర్ఎస్ ఖండించలేదని దయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి చెప్పారు. రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం సన్న ధాన్యానికి బోనస్‌ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లపై బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో హరియాణా, పంజాబ్‌ను అధిగమించామని.. దేశంలోనే ఎక్కవ ధాన్యం తెలంగాణలోనే పండుతుందని మంత్రి చెప్పారు. గతంలో కోటి 46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదని.. ప్రస్తుతం కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్‌ ప్రకటించామని.. అందుకే సన్నాల ఉత్పత్తి పెరిగిందని తుమ్మల చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News