Sunday, January 19, 2025

మేడిగడ్డలో టెక్నికల్‌గా ఏం జరిగిందో వారే చెప్పాలి: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిల్లర్లు కుంగిపోవడంపై డ్యాం సెఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ లో దెబ్బతిన్న పిల్లర్లను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తున్నామని, మూడు బ్యారేజీలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అనుమానాలను తేల్చడానికే సమీక్షలు చేస్తున్నామని, ఆ రోజు జరిగిన విషయాలను అధికారులు ప్రజలకు చెప్పాలన్నారు. మేడిగడ్డలో టెక్నికల్‌గా ఏం జరిగిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇంజినీర్లు, అధికారులపై తమకు ఎలాంటి ద్వేషం లేదనిచెప్పారు. కరకట్టలతో ముంపు రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News