- Advertisement -
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి సంబంధం లేనివి మాట్లాడితేనే మా సభ్యులు స్పందించారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్పీకర్ ను బెదిరించేలా మాట్లాడిన వ్యాఖ్యలు ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగదీష్ రెడ్డికి శ్రీధర్ బాబు రీకౌంటర్ ఇచ్చారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పదేళ్లలో వాళ్లేం చేశారు… ఏడాదిలో తామేం చేశామో.. చెప్పేప్రయత్నం చేశామని తెలియజేశారు. 14 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఏం చేయలేదో ప్రజలకు చెప్పామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
- Advertisement -