Sunday, December 22, 2024

కాళేశ్వరం సురక్షితం కాదని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పింది: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా.. బిఆర్ఎస్ నేతల తీరులో మార్పు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మేడిగడ్డ కుంగిపోతే.. చిన్న విషయాన్ని భూతద్దమంతా చూపిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. నిపుణులు, అధికారులు చెప్పినా వినకుండా ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృధా చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు.. కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితం కాదని మేము చెప్పలేదు.. డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు.

ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసిన కెసిఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. ప్రాజెక్టు మరమ్మతులు నిపుణుల సూచన మేరకు జరుగుతుందని… సలహాలపై మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు మళ్లీ కుంగిపోతుందని మంత్రి శ్రీదర్ బాబా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News