- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: ఐటి, పరిశ్రమలశాఖ మంత్రిగా దుద్దుళ్ళ శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో తల్లి, వేద పండితులు ఆశీర్వచనాలతో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి శైలజా రామయ్యర్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయడం, లీకులు ఇవ్వడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం చర్యలకు పాల్పడవద్దన్నారు. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.
- Advertisement -