- Advertisement -
జైపూర్: పక్కింటి వ్యక్తితో కూతురు ప్రేమ వ్యవహారం నడిపిస్తుందనే అనుమానంతో కూతురును తండ్రి గొంతు నులిమి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం శ్రీగంగానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సర్దార్‌గఢ్‌లో గుమా ఖాన్ అనే వ్యక్తి హీనో బానో అనే కూతురు ఉంది. హీనో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోంది. ఆమె గత కొన్ని రోజుల నుంచి పక్కింటి వ్యక్తి లుక్క మాన్ ఖాన్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం తండ్రికి తెలియడంతో ఆమె మందిలించాడు. లుక్కా మాన్ ఖాన్‌తో ప్రేమాయణం జరుపుతున్నట్టు అనుమానం రావడంతో ఆమె నిద్రిస్తుండగా గొంతు నులిమి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సూరత్‌గఢ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -