- Advertisement -
హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరద్వాజ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను శిరీష్ వివాహం చేసుకున్నారు. శ్రీజతో విడాకుల తీసుకున్న అనంతరం మరో రెండో పెళ్లి చేసుకున్నాడు. శ్రీజ- శిరీష్ దంపతులకు ఓ కూతురు ఉన్న విషయం తెలిసిందే. కల్యాణ్ దేవ్ అనే వ్యక్తిని శ్రీజ రెండో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది.
- Advertisement -