Monday, December 23, 2024

రైలు ప్రమాద ఘటనలో వ్యక్తి మృతి.. రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఎపి సర్కార్

- Advertisement -
- Advertisement -

శ్రీకాకుళం: ఒడిశాలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వ్యక్తి రైలు ప్రమాదానికి గురై మృతిచెందాడు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (60) శనివారం యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. జూట్ కూలీగా పనిచేస్తున్న గురుమూర్తి బాలాసోర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. రైలు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తామని ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

గురుమూర్తి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనలో ఎపికి చెందిన వ్యక్తి మృతి చెందారని బొత్స తెలిపారు. మృతుడిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించామన్నారు. ఎపిలో పెన్షన్ తీసుకుని వెళ్తుండగా మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి కూడా లక్ష పరిహారం అందిస్తామని మంత్రి బొత్స ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News