Thursday, January 23, 2025

ఊహతో విడాకులపై స్పందించిన శ్రీకాంత్..

- Advertisement -
- Advertisement -

తాను, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో ఫేక్ న్యూస్ వస్తుండడాన్ని హీరో శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను. గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు నేను, ఊహ విడాకులు తీసుకుంటున్నామంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. నిరాధారమైన పుకార్లను సృష్టిస్తున్న వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను”అని అన్నారు.

Srikanth denied divorce with Uha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News