Wednesday, January 22, 2025

కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’..

- Advertisement -
- Advertisement -

సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఈ సినిమాను ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “దర్శకులు రమేష్, గోపిల కాంబోలో రూపొందిన ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్‌ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. హీరో రమణ్ మాట్లాడుతూ.. “దర్శకులు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూర్తి వినోదాత్మక చిత్రమిది”అని అన్నారు.

Srikanth Launches Reddy Garintlo Rowdyism Trailer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News