Monday, December 23, 2024

‘పిండం’ చూసి భయపడతారు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించిన చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది. ఈ సమావేశంలో కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. “పిండం సినిమా ఏంటి అనేది ఈనెల 15న తెలుస్తుంది.

ఈ చిత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది”అని అన్నారు. దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ “నల్గొండ జిల్లాలో జరిగిన ఒక యదార్థ ఘటనను తీసుకొని, దాని చుట్టూ కల్పిత కథ అల్లుకొని, దీనిని హారర్ జానర్‌లో చెబితే బాగుంటుందనే ఆలోచనతో పిండం కథను రాసుకున్నాము. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా చూసి భయపడతారు”అని తెలిపారు. నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ ఈనెల 15న మా పిండం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో కథానాయిక ఖుషి రవి, సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సూరంపల్లి, సిద్ధార్థ, సతీష్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News