- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మ గురువారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కలిశారు. కెటిఆర్‌ను కలిసిన ఆమె తన మనవరాలి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకరమ్మ కెటిఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి తదితర పార్టీల నేతలతో కలిసి భోజనం చేశారు. శ్రీకాంత్ చారి డిసెంబర్ 2009లో కొత్త రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తనను తాను నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- Advertisement -