అమ్మవారికి కుంకుమర్చన… శ్రావణమాస పూజలు
యాదాద్రి ఆలయ నిత్యరాబడి రూ.25.08 లక్షలు…..
మనతెలంగాణ/యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో శ్రావణమాసం ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన, ఊంజల్ సేవ మహోత్సవాన్ని ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసిన అర్చకులు మేళతాళాలు, మంత్రోచ్ఛరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పురవీధులలో ఊరేగించారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను అర్చకులు భక్తులకు వివరించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకొని తరంచారు.
Also Read: అదుపు తప్పి కిందపడిన బీహార్ సిఎం నితీశ్ కుమార్
అమ్మవారికి కుంకుమార్చన……
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణమాసం కావడంతో అమ్మవారికి వేదోక్తంగా అర్చకులు కుంకుమార్చనను నిర్వహించారు. శ్రావణమాసం చివరివారం కావడంతో భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం తరలివచ్చారు. ఉ.10 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనలో పాల్గొనే దంపతులు రూ.2 వేలు చెల్లించి పూజలో పాల్గొని దర్శిఃచుకున్నారు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్న దంపతులకు శేషవస్త్రం, శెల్లా, అభిషేకం లడ్డూ అందచేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రోజున రూ.25,08,374 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,63,650, బ్రేక్ దర్శనం ద్వారా రూ.1,14,900, వ్రత పూజల ద్వారా రూ.1,26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ.75,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.2.00,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.7,00,360 తో పాటు తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.