Monday, December 23, 2024

ప్రతీకారం తీర్చుకున్న లంక

- Advertisement -
- Advertisement -

రెండో వన్డేలో ఆఫ్ఘన్ చిత్తు

సూర్యవేవా : తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలై శ్రీలంక రెండో వన్డేలో ఆఫ్ఘన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. హంబన్‌తోట వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో 132 పరుగులతో భారీ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది లంక. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది.

Also Read: తెలంగాణ అమ్మాయి మహిమ ఘన విజయం

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్ ధనంజయ డిసిల్వ (-3/39) ఆఫ్ఘన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్ చేసి లంక గెలుపు బాటలు వేశాడు. అదేవిధంగా చమీరా (2/18), తీక్షణ (1/35), షనక (1/29) బాల్‌తో రాణించడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News