Friday, January 10, 2025

ఆదుకున్న కరుణరత్నె, చండీమల్

- Advertisement -
- Advertisement -

శ్రీలంక 237/4, కివీస్‌తో తొలి టెస్టు

గాలె: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మెరుగైన స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దీంతో లంకకు ఇప్పటి వరకు 202 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (2) మరోసారి నిరాశ పరిచాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండీమల్‌తో కలిసి మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కరుణరత్నె, చండీమల్‌లు కుదురుగా ఆడుతూ లంకను కష్టాల్లోంచి గట్టెక్కించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్‌తోనే స్ట్రయిక్‌ను రొటెట్ చేశారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన కరుణరత్నె ఆరు ఫోర్లతో 83 పరుగులు చేశాడు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన చండీమల్ 150 బంతుల్లో ఆరు ఫోర్లతో 61 పరుగులు సాధించాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కమిందు మెండిస్ (13) ఈసారి ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఇక ఆట ముగిసే సమయానికి ఎంజిలో మాథ్యూస్ (34), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (34) క్రీజులో ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిఛెల్ (57), ఫిలిప్స్ (49) నాటౌట్ జట్టుకు అండగా నిలిచారు. లంక బౌలర్లలో జయసూర్య నాలుగు, మెండిస్ మూడు, డిసిల్వా రెండు వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News