Thursday, January 23, 2025

బంగ్లాపై శ్రీలంక ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : ఆసియా కప్‌లో భాగం గా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుశాల్ మెండీస్(60), పతుం నిశాంకా(20), దసున్ శన కా(45), చివరలో ఛమికా కరుణారత్నే(16) చెలరేగడంతో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఎలాగైనా సూపర్ ఫోర్‌లోమ స్థానం సంపాదించాలనుకున్న బంగ్లా ఆశలు నెరవేరలేదు. బంగ్లాదేశ్ చెప్పినట్లుగానే రికార్డు స్కోర్‌తో లంక ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈ గడ్డపై బంగ్లాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బంగ్లా జట్టులో మెహిదీ హసన్ మీర్జా (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), అఫిఫ్ హోస్సెన్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మొసాద్దేక్ హోస్సెన్(9 బంతుల్లో 4 ఫోర్లు 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లంక బౌలర్లలో హసరంగా, కరణరత్నే రెండేసి వికెట్లు తీయగా.. దిల్లాన్, మహీశ్ తీక్షణ, ఫెర్నాండో తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News