Monday, December 23, 2024

శ్రీలంక శుభారంభం

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్‌బి ఆరంభ మ్యాచ్‌లో లంక ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో కేవలం 164 పరుగులకే ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 39 ఓవర్లలోనే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా లంక తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రతి పరుగు కోసం బ్యాటర్లు తీవ్రంగా పోరాడక తప్పలేదు.

ఒక దశలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంకను సమరవిక్రమ, చరిథ్ అసలంక ఆదుకున్నారు. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సమరవిక్రమ ఆరు ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన అసలంక ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 62 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. పతిరణ నాలుగు, తీక్షణ రెండు తీశారు. బంగ్లా టీమ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో (89) ఒక్కడే రాణించాడు.

Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News