Thursday, January 23, 2025

శ్రీలంకకు హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఆసియాకప్ సూపర్4 విభాగం పోటీల్లో శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిం ది. శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో పటిష్టమైన పాకిస్థాన్‌ను ఓడించింది. ఇక శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగానే మిగిలిపోయిం ది. ఆదివారం ఇరు జట్ల మధ్య తుది సమరం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పాక్‌కు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. బాబర్ ఆజమ్ (30), నవాజ్(26) మాత్రమే రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 17 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పో యి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ పాథుమ్ ని సాంకా 55(నాటౌట్) జట్టును గెలిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News