Tuesday, December 17, 2024

లంక బౌలింగ్ లో విలవిలలాడిన విండీస్….

- Advertisement -
- Advertisement -

దంబుల్లా: శ్రీలంక-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టి20లో లంక ఘన విజయం సాధించింది. విండీస్‌పై లంక 73 పరుగులతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 163 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. లంక బౌలర్ల ధాటికి విండీస్ విలవిలలాడిపోయింది. 16.1 ఓవర్లలో 89 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో రోవ్‌మన్ పావెల్(20), శెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ (14), అల్జారీ జోషెఫ్(16), మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో దునీత్ వాల్లలాగే మూడు వికెట్లు, మహీశ్ తీక్షన, చరితా అసలంకా, వానిందు హసరంగా తలో రెండు వికెట్లు, మతీశా పతిరానా ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి పతుమ్ నిశాంక(54) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మూడు టీ 20 సిరీస్‌లో 1-1 సమవుజ్జీలుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News