Monday, January 20, 2025

శ్రీలంకకు సిరీస్

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో శ్రీలంక పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 10తో కైవసం చేసుకుంది. శుక్రవారం చివరి రోజు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. 34/4 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రహీం (23) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఈ దశలో లిటన్ దాస్ (52), షకిబ్ (58) కొద్ది సేపు పోరాటం చేశారు. వీరు ఔటైన తర్వాత బంగ్లా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో ఫెర్నాండో ఆరు వికెట్లు తీశాడు. ఇక 29 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని లంక వికెట్ కోల్పోకుండానే ఛేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News