Wednesday, December 25, 2024

మూడో వన్డేలో లంక గెలుపు… సిరీస్ కైవసం…

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. మూడు వన్డేలో లంక తొమ్మిది వికెట్ల తేడాతో గెలుచుకోవడంతో 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 117 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన లంక 16 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో పథుమ్ నిషాంక, దిముత్ కరుణారత్నె హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కుశాల్ మెండీస్ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో నైబీ ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు. నాలుగు వికెట్లు తీసిన దుశ్‌మంతా ఛమీరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

Also Read: గొంతులో దిగిన కత్తితో బైక్‌పై ఆసుపత్రికి.. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News