Sunday, January 19, 2025

ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ స్టోన్‌ను తొలగించిన శ్రీలంక ఆర్మీ వైద్యులు

- Advertisement -
- Advertisement -

కొలంబో: ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిని శ్రీలంక ఆర్మీ డాక్టర్లు తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2004లో భారతీయ డాక్టర్లు సాధించిన రికార్డును శ్రీలంక ఆర్మీ డాక్టర్లు అధిగమించారు.

కొలంబోలోని ఆర్మీ ఆసుపత్రిలో ఈ నెల మొదట్లో ఈ కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. 13.372 సెంటీమీటర్ల పొడవు, 801 గ్రాముల బరువున్న ఈ రాయిని సర్జరీ ద్వారా తొలగించినట్లు శ్రీలంక ఆర్మీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటివరకు ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద కడ్నీ స్టోన్‌ను 2004లో భారతీయ వైద్యులు తొలగించారు. దీని పొడవు 13 సెంటీమీటర్లు ఉంది. అదే విధంగా 620 గ్రాముల బరువున్న కిడ్నీస్టోన్‌ను 2008లో పాకిస్తాన్‌లో వైద్యులు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News