కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స క్షమాభిక్ష ప్రసాదించడంతో 16మంది ఎల్‌టిటిఇ అనుమానిత తీవ్రవాదులతోసహా 93 మంది ఖైదీలను శ్రీలంక ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశంలో భౌద్ధమత ప్రవేశానికి చిహ్నంగా దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బౌద్ధులు జరుపుకునే పోసోన్ పోయా వేడుక సందర్భంగా 93 మంది ఖైదీలు అధ్యక్షుడి క్షమాభిక్ష మేరకు విడుదలయ్యారు. విడుదలైన 93 మంది ఖైదీలలో ఎల్‌టిటిఇ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న 16 మంది ఖైదీలు కూడా ఉన్నారని కారాగార శాఖ ప్రతినిధి తుషార ఉపుల్‌డేనియా తెలిపారు. ఉత్తర శ్రీలంకలోని జాఫ్నా, మధ్య శ్రీలంకలోని అనురాధపుర పట్టణాలలోని కారాగారాల నుంచి ఎల్‌టిటిఇ అనుమానిత తీవ్రవాద ఖైదీలను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. తీవ్రవాద నిరోధక చట్టం(పిటిఎ) కింద వీరు గతంలో అరెస్టు అయ్యారు. బౌద్ధ మతానికి సంబంధించిన పెద్ద పండుగల సందర్భంగా ఖైదీల విడుదలకు సంబంధించి శ్రీలంక అధ్యక్షుడు క్షమాభిక్ష ఆదేశాల మేరకు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీలంక అధ్యక్షుడి క్షమాభిక్ష…. 93 మంది ఖైదీల విడుదల
- Advertisement -
- Advertisement -
- Advertisement -