Wednesday, January 22, 2025

ఫస్ట్ సింగిల్‌గా మెలోడి సాంగ్..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా పూర్తి అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ హీరో ఇంట్రడక్షన్ కాకుండా ఓ సూపర్ మెలోడిని ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక ఈ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మిస్తున్నారు.

Also Read: పాలమూరు రంగారెడ్డి కి పచ్చని సంకేతం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News