- Advertisement -
తన మొదటి సినిమా ‘పెళ్లి సందడి’తో అందరి చూపు తన మీద పడేలా చేసుకున్న కన్నడ భామ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. టాలీవుడ్‌లో మరే క్రేజీ హీరోయిన్‌కు లేని రీతిలో ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏడు సినిమాలు ఉన్నట్లు తెలిసింది. ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేందర్ రావు చలువతో ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజతో ‘ధమాకా’, బాలయ్య, మహేష్, శర్వానంద్, నితిన్ సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అటు స్టార్ హీరోలు, ఇటు యంగ్ హీరోలతో జత కట్టిన ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదంటున్నారు. ఆమె చేస్తున్న ఏడు మూవీల్లో మొదట రిలీజ్ అయ్యేది రవితేజతో నటిస్తున్న ధమాకా మూవీగా చెబుతున్నారు.
- Advertisement -