- Advertisement -
భద్రాద్రి: భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో బుదవారం వైభవంగా శ్రీమద్రామాయణ పారాయణం మహా క్రతువు ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి 12 గంటల వరకు వేద పండితులు పారాయణం చేయనున్నారు. భద్రాద్రిలో శ్రీమద్రామాయణ పారాయణం చేసేందుకు ఇరు రాష్ట్రాల నుంచి వేదపండితులు భద్రాచలానికి వచ్చారు. ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి వేద పండితులు రామాయణ పారాయణం చేస్తున్నారు. దీంతోపాటు ఆలయ అర్చకులు సప్తాహ వాహనం నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం వేదపండితులు ప్రవచనాల పారాయణం చేయనున్నారు. అలాగే, 15న విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
Srimad Ramayana Parayanam at Bhadrachalam Temple
- Advertisement -