Saturday, July 6, 2024

కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు

- Advertisement -
- Advertisement -

వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు ‘లక్కీ భాస్కర్‘ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేసింది.

జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘శ్రీమతి గారు‘ అనే మొదటి గీతాన్ని చిత్ర బృందం ఆవిష్కరించింది. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. వయోలిన్‌తో మొదలై, ఫ్లూట్ మెలోడీగా మారి, డ్రమ్ బీట్‌లతో మరో స్థాయికి వెళ్లి.. ప్రత్యేక శైలిలో ఎంతో అందంగా సాగింది ఈ పాట. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం, ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు‘ అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు.

1980-90ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని “లక్కీ భాస్కర్‌” చిత్రంలో చూడబోతున్నాం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News