Saturday, December 21, 2024

శ్రీనిధి కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగర శివారులోని ఘట్‌కేసర్ మండలంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీకి అనుమతి రాకముందే తప్పుడు సమాచారం ఇచ్చి సుమారు 280 మంది విద్యార్థులను చేర్చుకుని తరగతులు నిర్వహిస్తున్నారన్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల పలుమార్లు విద్యార్థి సంఘాలు ఈ విషయమై ఆందోళన చేసినా.. అనుమతి వస్తుందని యాజమాన్యం చెబుతూ వచ్చిందని అన్నారు. గత నెల 31న తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేయడంతో… శ్రీనిధి యూనివర్సిటీ కార్యదర్శి కె.టి. మహి తల్లిదండ్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులను శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలోకి తీసుకుంటామని, అందుకు ఆగస్టు 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులను కోరారు. తాజాగా గడువు అయిపోయినా విద్యార్థులను కళాశాలలోకి బదిలీ చేయకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్సిటీకి వస్తున్న ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News