Sunday, February 23, 2025

సిఎం ఓఎస్‌డిగా శ్రీనివాసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : సిఎం ఓఎస్‌డి గా వేముల శ్రీనివాసులు గు ప్తా నియమితులయ్యా రు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ ఇన్ స్పెక్టర్  జనరల్‌గా పని చేస్తోన్న ఆయనకు సిఎం ఓఎస్‌డిగా నియమిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారి చేశారు. వేముల శ్రీనివాసులు రిజిస్ట్రేషన్ శాఖలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. కంప్యూటీకరణ, ఈ చాలానా వంటి అనేక నూతన విధానాలను రూపొందించిన ఘనత ఆయనదే. పౌర సేవల్లో సాంకేతిక వినియోగం పట్ల ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన శ్రీనివాసులు సీఎం ఓఎస్టీగా నియామకం కావ డం పట్ల ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News