Sunday, January 19, 2025

హైదరాబాద్ కు చెందిన టైక్వాండో క్రీడాకారిణికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టైక్వాండో క్రీడలో పతకాలు సాధిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న హైదరాబాద్ కు చెందిన టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్విని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఇంగ్లండ్ లోని మంచెస్టర్ సిటీలో మార్చి 11 నుండి 13వరకు జరిగిన ఇంటర్నేషనల్ టైక్వాండో టౌర్నమెంట్ లో కాంస్య పతకం, అమెరికాలోని డల్లాస్ లో మార్చి 19 నుండి 21వరకు జరిగిన ఇంటర్నేషనల్ టైక్వాండో టౌర్నమెంట్ లో రెండు రజత పతకాలను సాధించిన సింధు తపస్విని నగరంలోని తన కార్యాలయంలో మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు కుమార్తె సింధు తపస్వి అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్ లో మెరుగైన శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణిస్తూన్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిజిఒ కేంద్ర సంఘం అధ్యక్షులు మమత, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud appreciates taekwondo player Sindhu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News