మహబూబ్ నగర్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు కోవిడ్-19 నివారణకై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో భాగంగా “ఇంటింటి ఆరోగ్యం” కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి.. జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డిసిసిబి వైస్ ఛైర్మన్ వెంకటయ్య, పలువురు కౌన్సిలర్ లు, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఆదనపు కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, డిఎమ్ హెచ్ఒ కృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Srinivas Goud begins fever survey in Yenugonda
- Advertisement -