హైదరాబాద్: ప్రశ్నించేవారు కావాలో పరిష్కరించే వారు కావాలో పట్టభద్రులే ఆలోచించుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన ప్రవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల యాజమాన్యాల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బిజెపి ఎంఎల్‌సి అభ్యర్థి రాంచందర్ రావు ఏం ప్రశ్నించారు, ఏం పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సిగా ఉండి ఒక వాటర్ ఫిల్టర్ కూడా పెట్టలేకపోయాడని, న్యాయవాదులకే రాంచందర్ రావు న్యాయం చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ అమ్మడంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా పిఆర్‌సి ఉంటుందని పేర్కొన్నారు.
వాటితో రిజర్వేషన్లు కోల్పోతున్నారు: శ్రీనివాస్ గౌడ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -