Friday, December 27, 2024

నీరా కేఫ్ పాయింట్ వద్ద మంత్రి కెటిఆర్ పుట్టిరోజు సెలబ్రేషన్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ(ఎస్ఎటిఎస్) ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద తెలంగాణ ట్రై క్రీడ వేడుక-2023లో భాగంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం సైక్లింగ్ స్పోర్ట్స్ మీట్ ను ఎస్ఎటిఎస్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్య కార్పొరేషన్ చైర్మన్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బిసి కమిషన్ సభ్యులు కె.కిషోర్ గౌడ్, మాజీ చైర్మన్ జి శ్రీనివాస్ యాదవ్, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ, మర్రి లక్ష్మారెడ్డి, ప్రేమ్ రాజ్, క్రీడాకారులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News