Monday, November 18, 2024

మక్తల్‌లో రూ.5కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మక్తల్: తెలంగాణ రాష్ట్రంలోని 33జిల్లాల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తున్నదని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.5కోట్ల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు శనివారం మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎంపి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పేట కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని పలు వార్డుల్లో 2.77కి.మీల మేర సిసి రోడ్లు, 2.84కి.మీల మేర మురుగు కాల్వల నిర్మాణానికి భూమిపూజ చేయడం సంతోషదాయకమన్నారు. మక్తల్ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోట్ల నిధులతో మక్తల్ పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టి పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, రాజేష్‌గౌడ్, అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పసుల శ్వేత, కలాల్ జ్యోతి, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News