Sunday, December 22, 2024

మహబూబ్‌నగర్ సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మహబూబ్ నగర్ పట్టణంలోని ట్యాంక్ బండ్‌పై 14 కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం పై పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ఆ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మహబూబ్ నగర్ పట్టణానికి ఐకానిక్ గా నిలిచే ఈ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ పర్యాటక శాఖ దేశంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తోందనీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్రిడ్జి మెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గిరీష్ భరత్వాజ్ స్వయంగా దీనికి డిజైన్ చేసి నిర్మించారని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పర్యాటకాభివృద్ది సంస్థ ఛైర్మెన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, టూరిజం శాఖ ఓఎస్‌డి సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News