Monday, January 20, 2025

కంప్యూటర్ , ఫైళ్లను తరలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రవీంద్ర భారతిలోని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్‌లోని ఫర్నిచర్ ను మంత్రి మనుషులు అక్కడి నుండి అక్రమంగా తరలించగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంకు చేరుకుని ఘటనను పరిశీలించగా అక్కడ ఉన్న ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్‌ను కొందరు ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు పట్టు కున్నారు. కంప్యూటర్ తదితర ప్రభుత్వ వస్తువులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు బుధవారం ఉదయం అక్కడ ధర్నాకు దిగారు. అంతే కాకుండా ఫైళ్ల తరలింపు ఘటనపై వారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News