మహబూబ్ నగర్: కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స‌్వాతంత్ర్య సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ, వర్ధంతి సందర్భంగా జిల్లాలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. బాపూజీ క్విట్ ఇండియా, ముల్కీ వ్యతిరేక ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రావు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు అనంత రాములు, సంఘం నాయకులు సత్యనారాయణ, శంకర్, వెంకటేష్, ప్రతాప్, సుభాష్ చంద్ర, నాగ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Srinivas Goud Pays Tribute to Konda Laxman Bapuji