హైదరాబాద్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురించి తాము మాట్లాడుతున్నమా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎవరి పార్టీ వారి ఇష్టమని, ఓర్వ లేని తనంతో సిఎం కెసిఆర్ ను కాంగ్రెస్ బిజెపి నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కెటిఆర్ తండ్రికి తగ్గ తనయుడని, కెటిఆర్ సమర్ధుడని, అందుకే ఆయన్ను ఫ్రాన్స్ దేశం ఆహ్వానించిందన్నారు. ఇందులో పైరవీలు ఉంటాయా అని నిలదీశారు. మా పార్టీ ఎట్లుండాలి అని వారే నిర్ణయిస్తారా? దుయ్యబట్టారు.
ఇది మంచి పద్ధతి కాదని, దళితబంధును చూసి ఓర్వలేకే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు గా మాట్లాడుతున్నారని, తెలంగాణ ను కన్ఫ్యూషన్ చేయడమే ప్రతిపక్షాల పని, బిఆర్ అంబేడ్కర్ చెప్పినట్టు పాలన సాగించి సంక్షేమం అందిస్తున్నందుకే కెసిఆర్ పై ప్రతిపక్షాలకు కోపంగా ఉందన్నారు. వేరే వారు పార్టీ పెడితే అందులో కొనసాగుతూ కెసిఆర్ యే స్వయంగా పెట్టిన పార్టీ ని విమర్శిస్తారా? అని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బహిరంగ చర్చ అంటున్నారని, ఎన్నికలుండగా ఇంకా చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి కొలమానమని, ఇంకా వేరే కొలమానం ఎందుకు అని అడిగారు. ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నందుకు ప్రతిపక్షాలకు కడుపు మంటగా మారిందన్నారు. కాంగ్రెస్ బిజెపి నేతల విమర్శలు ఎవ్వరూ పట్టించుకోరని,